నీతిమాలిన‌ నాయ‌కుడు చంద్ర‌బాబు- కాకాణి ధ్వ‌జం

48

The bullet news (Podalakuru)- వ‌య‌స్సు పెరిగే కొద్ది చంద్రబాబు నాయుడికి ఉన్న‌ బుద్ది కాస్తా దిగ‌జారిపోతోందని వైసీపీ నెల్లూరుజి్ల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి విమ‌ర్శించారు. పొద‌ల‌కూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడి ఆరోగ్య ప‌రిస్థితిపై విచారం వ్య‌క్తం చేశారు.. రాష్టంలో జ‌గ‌న్ కు ఆద‌ర‌ణ పెర‌గ‌తుండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు అక్క‌స్సు వెల్ల‌గ‌క్కుతున్నార‌న్నారు.. అందుకే దిగ‌జారి మ‌రి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి రాష్టంలో ఇప్ప‌టివ‌ర‌కు 3 ల‌క్ష‌ల కోట్ల కుంభ‌కోణాలు జ‌రిగాయ‌న్నారు.. తాను నీతిమంతుడ‌ని చెప్పుకునే బాబుకు ఈ అవినీతి క‌నిపించ‌లేదా అని ప్ర‌శ్నించారు..ఆంధ్ర‌రాష్ట చ‌రిత్ర‌లో ఇంత పెద్ద అవినీతికి పాల్ప‌డిన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు చిర‌స్థాయిగా నిలిచిపోతారన్నారు.. జ‌గ‌న్ కు చ‌దువు ఒంట‌ప‌ట్ట‌క అమెరికా నుంచి పారిపోయి వ‌చ్చార‌న్న‌వ్యాఖ్య‌ల‌ను కాకాణి ఖండించారు.. ఇంటిమీద బెంగ‌తోనే జ‌గ‌న్ ను అమెరికా నుంచి వ‌చ్చారు త‌ప్ప లోకేష్ లాగా విదేశీ మ‌హిళ‌లతో విన్యాసాలు చేయ‌లేద‌న్నారు. చిన్న‌బాబు చేసిన విన్యాసాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నా చంద్ర‌బాబుకు సిగ్గురాలేద‌న్నారు. .వేల కోట్ల ప్ర‌జ‌ల సొమ్మును దిగ‌మింగిన స‌త్యం రామ‌లింగ రాజు కుమారుడికి లోకేష్ రూమ్ మెట్ కాదా అని ప్ర‌శ్నించారు.. ఏపీని చంద్ర‌బాబు నాయుడు భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని మండిప‌డ్డారు..

SHARE