విలీన గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఆమరణదీక్షకైనా సిద్దమే – రూరల్ ఎమ్మెల్యే

103

The bullet news ( Nellore)-  నెల్లూరు కార్పోరేషన్ లోని విలీన గ్రామాలైన అల్లీపురం, బలరామపురం గ్రామాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నగర కార్పోరేషన్ ఎదుట రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు.. అల్లీపురం, బలరామపురం గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి ఆయన
కార్పోరేషన్ ఎదుట బైఠాయించారు. అల్లీపురం, బలరామపురం గ్రామాలు కార్పోరేషణ్ పరిధిలోకి విలీనం అయినప్పటి నుంచి ఈ గ్రామాలు అభివ్రుద్దికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, శ్మశానవాటికల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.. దాదాపు లక్ష జనాభా కలిగిన విలీన గ్రామాల ప్రజల సమస్యల పరిస్కారం కోసం ఆమరణ దీక్షకైనా సిద్దమైనని కోటంరెడ్డి
ప్రకటించారు.. విలీన గ్రామాలకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం
చేశారు..

SHARE