అందుకే ఛార్జిషీట్‌లో జగన్‌ భార్య పేరు..

103

The bullet news (Political)- మహా సంప్రోక్షణ లాంటి పవిత్ర కార్యక్రమం పైనా విమర్శలు చేయడం సరికాదని టీటీడీ పాలక మండలి సభ్యుడు పెద్దిరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తిరుపతిలో మాట్లాడుతూ దేవుడ్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే అనుభవిస్తారని ధ్వజమెత్తారు. తిరుమల పై రాజకీయాలు చేసినందునే ఈడీ కేసులో వైసీపీ అధినేత జగన్ సతీమణిని నిందితురాలిగా చేర్చారని అభిప్రాయపడ్డారు. తన భార్యను రాజకీయాలకు లాగుతున్నారని జగన్‌ అంటున్నారని.. మరి కోట్ల మంది దైవం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగవచ్చా అని ప్రశ్నించారు. భక్తులు బాధ పడేలా వివాదాలు సృష్టించ కూడదని పెద్దిరెడ్డి హితవు పలికారు.

SHARE