పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

127

The bullet news(wedding)-రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఇంటి ఎదుట ఉంచిన రెండు కార్లు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

SHARE