గిరిజనుల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయం కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి

134

The bullet news (Kovuru)_ యానాదులకు ప్రభుత్వం అండగా ఉందని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు.. నెల్లూరు జూబ్లిహాల్ లో ఏర్పాటు చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ 8 వ గవర్నిగ్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ యానాధుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. జిల్లాలో యానాదుల కోసం దాదాపు 25వేల ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో ఆయన తెలియజేశారు.. ల్యాండ్ పర్చేజింగ్ పథకం ద్వారా భూములు యానాధులకు ఇవ్వగలిగితే వారికి ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చినట్లువుతుందన్నారు.. దాంతో పాటు గిరిజనులకు ఇచ్చే 35 కిలోల బియ్యం ఇంకా లబ్ది దారులకు ఇవ్వాలన్నారు. చేపల వృత్తి లో ఉన్న గిరిజనులు కు కావలసిన వలలు,పడవలు సైకిళ్ళు పంపిణీ ని సక్రమంగా నిర్వహించాలి ఆయన సమావేశంలో సూచించారు.. గిరిజన సంక్షేమ కోసం ప్రభుత్వం చేస్తున్న పధకాలు వారికి అందేలా చెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిమీదా ఉందన్నారు.. అలా క్షేత్రస్థాయిలో అందినప్పుడే గిరిజనులు అభివ్రుద్ది చెందుతారన్నారు..

SHARE