ఆ ఇద్దరూ.. ఒకే చోట

125

The bullet news (Chittor)_ ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్షనేత వైఎస్‌ జగన్‌ ఈసారి సంక్రాంతికి ఒకే జిల్లాలో, ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండనున్నారు. చంద్రబాబు ప్రతి ఏటా తన సొంత ఊరైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి చేసుకుంటారు. ఆయన 13వ తేదీ చిత్తూరు, తిరుపతిలో పర్యటించి… సాయంత్రానికి నారావారిపల్లెకు చేరుకుంటారు. 14, 15 తేదీల్లో అక్కడే ఉంటారు. 16వ తేదీ కనుమ పండుగ విందు ఆరగించి అమరావతికి బయలుదేరతారు. ఇక… ప్రస్తుతం విపక్షనేత జగన్‌ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం ఆయన 14వ తేదీ ఉదయానికంతా చంద్రగిరి నియోజకవర్గ సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే… యాత్ర మార్గంలో మార్పుల నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలో జగన్‌ పర్యటించనున్నారు. ఇలా ప్రభుత్వాధినేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ పండగ సమయంలో ఒకే నియోజకవర్గ పరిధిలో సమీప గ్రామాల్లో బస చేయనుండడం యాదృచ్ఛికమే అయినా, ఆసక్తికరంగా మారింది.

SHARE