ఏపీకి తీరని అన్యాయం జరిగింది.. – ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి

86

The bullet news (Podalakuru)_ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు గురువారం చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. పొదలకూరులో పార్టీలు చేస్తున్న బంద్ కు వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.. ఈ సందర్భంగా కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ఏపికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం దొంగనాటకాలుడుతుందని మండిపడ్డారు.. విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్క హామీని బిజేపి నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. ప్రత్యేకహోదా, బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష వైసీపీ, వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడంతో తెలుగుదేశం ప్రభుత్వం బంద్ ను అణచివేయాలని చూస్తోందన్నారు.. ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కన్న ఆయన హోదా కోసం వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు..

SHARE