భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదని…భర్త దారుణానికి పాల్పడ్డాడు

52

the bullet news(bhupal)-   భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదనే ఆవేదనతో గదిలోకి వెళ్లిన భర్త సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని అశోక్ గార్డెన్ ప్రాంతానికి చెందిన శంకర్ విశ్వకర్మ ఓ హోటల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యం తాగే అలవాటున్న శంకర్ రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో కలిసి భోజనం చేసి టీవీ చూసేందుకు రిమోట్ అడిగాడు. భార్య టీవీ చూడవద్దని విశ్రాంతి తీసుకోవాలని భర్తను కోరి రిమోట్ ఇవ్వలేదు. అంతే భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదనే ఆవేదనతో గదిలోకి వెళ్లిన శంకర్ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ మద్యానికి బానిస కావడంతో చిన్న విషయానికే ఆవేదన చెందుతాడని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

SHARE