పక్కనే భార్య ఉన్నా.. ఆమెను చూడగానే ప్లాట్

70

The bullet news (America)_  తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. మెదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు… అంటూ పాడుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెలానియాను చూసిన మొదటి చూపులోనే. 1998లో ఆమెకు 28 ఏళ్ల వయసున్నప్పుడు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికే ట్రంప్‌కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరితో సంబంధాలు బాలేదు. అలా అని విడాకులు కూడా తీసుకోలేదు. మెలానియాను చూడాగానే ప్లాటయిన ట్రంప్ ఆమెని ఫాలో అయ్యాడు. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలానియా ఇవ్వకుండా తప్పించుకున్నా ఎలాగో ఫోన్ నెంబర్ సంపాదించి రోజూ ఫోన్లో చిట్ చాట్‌లు జరిపేవాడు. ఇక దాంతో మెలానియా కూడా ట్రంప్ ట్రాప్‌లో పడిపోయింది. వీరి ప్రేమాయణం అందరికీ తెలిసిపోయింది. 2004లో ఉంగరాలు మార్చుకుని 2005లో పెళ్లి పీటలు ఎక్కారు. 2006లో ఓ బిడ్డకు తల్లి కూడా అయింది మెలానియా. అతడే బ్యారన్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి భార్య అయిన మెలానియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసినా స్లోవేనియా, సెర్బియా, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, భాషలు అనర్గళంగా మాట్లాడేస్తుంది.

SHARE