వాళ్లు అంగ‌న్వాడీ ఉద్యోగులా.? టీడీపీ కార్య‌క‌ర్త‌లా ..? – సీఎం స‌భ‌కు అంగ‌న్వాడీల‌ను త‌ర‌లించ‌డంపై వైసీపీ విద్యార్ది విభాగం రాష్ట కార్య‌ద‌ర్శి తుల‌సీ పైర్

115

The bullet news  (Manubolu)- కోడూరుపాడులో జ‌రిగిన ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి స‌భ‌కు అంగ‌న్వాడీల‌ను త‌ర‌లించ‌డంపై వైసీపీ విద్యార్ది విభాగం రాష్ట కార్య‌ద‌ర్శి ఆవుల తుల‌సీ యాద‌వ్ మండిప‌డ్డారు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంన్వాడీ కేంద్రాల‌ను మూసేసి జ‌న్మ‌భూమికి త‌ర‌లించ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలో అంగ‌న్ వాడీ కేంద్రాల‌ను మూసేసి అంగన్వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను, ఆయాల‌ను త‌ర‌లించ‌డం వ‌ల్ల బాలింత‌లు, చిన్నారులు పౌష్టికాహారం అంద‌క తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. సీఎం స‌భ‌లో జ‌నాలు లేక‌పోతే చంద్రబాబునాయుడు ఆగ్ర‌హిస్తార‌ని అధికారులు ఇలా అంన్వాడీల‌ను త‌ర‌లించార‌న్నారు. ముఖ్య‌మంత్రి మెప్పు కోసం ఇలా చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటికే జ‌న్మ‌భూమి పేరుతో ఆయా గ్రామాల్లోని అంగ‌న్వాడీ కేంద్రాల‌ను స్థానిక నేత‌లు మూసేస్తున్నార‌ని మండిప‌డ్డారు.. రోజుకో ప్ర‌భుత్వ ర్యాలీ పేరుతో విద్యార్దుల‌ను, అంగ‌న్వాడీ ఆయాల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.. ఈ కార్య‌క్ర‌మంలో వంశీ, సాయి, రాము, స‌తీష్, వాసు, భాస్క‌ర్, హ‌రి ఉన్నారు..

SHARE