వాళ్లు ఏపీకి శత్రువులు.. వైసీపీకి మిత్రులు.. – మంత్రి సోమిరెడ్డి కామెంట్

77

THE BULLET NEWS (NELLORE)-రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత బిజేపీ ఎంపి నరసింహారావుకు ఉన్న మతి కాస్త పోయిందని విమర్శించారు రాష్ట వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపి నరసింహారావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. బిజేపీ నాయకులు ఏపీ అభివ్రుద్దిని సైందవుల్లా అడ్డుకుంటున్నారని విమర్శించారు..ఏపీకి శత్రువులుగా, వైసీపీకి మిత్రులుగా బిజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. పోలవరాన్ని నితిన్ గడ్కరీ సందర్శించి సీఎం చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తే ఆయన డిల్లీ వెళ్లిన వెంటనే ఇక్కడి నాయకులు పోలవరంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.. పీడీ అకౌంట్స్ లో 58 వేల కోట్ల కుంభకోణం జరిగిందటూ ఎంపీ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.. 58 వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ప్రధాని నరేంద్రమోడీ, ఆర్బీఐ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహ రావు నెల్లూరుకు వస్తే అకౌంట్స్ పై స్పెషల్ క్లాస్ ఇప్పిస్తామని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర రాష్టం నుంచి బిజేపీ దిగుమతి చేసిన నాయకుడు నరసింహారావు అంటూ మండిపడ్డారు.

SHARE