అవి చూపులా… మన్మథ బాణాలా… క్షణాల్లో అన్ని హొయలా?

143

The bullet news (Love)- కన్ను కొట్టింది.. కోట్ల మంది హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది.. వాలెంటైన్స్ డేకి ముందే మన్మథ బాణాలాంటి చూపుల‌తో యువ‌త హృద‌యాల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.. చూపులతో మాయ చేసింది.. హావాభావాల‌తో అద‌ర‌గొట్టింది.. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లాడి నుంచి ముస‌లోళ్ల‌దాకా అంద‌రిని త‌న క‌ళ్ల‌తో ఫిదా చేసింది.. రాత్రికి రాత్రే య‌వ‌త క‌ల‌ల రాణిగా మారిపోయింది..

మెరుపులా అవి చూపులా? కళ్ల లేకా మన్మథ బాణాలా? క్షణాల్లో అన్ని హొయలా? కాటుకళ్ల అందమంతా ఈమెలోనే ఉందా? అంటూ కుర్రకారు ప్రశ్నిస్తున్నారు లేటెస్ట్‌ కుట్టి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను.. చూసి చూడంగానే నచ్చేసావే అంటూ పాటలు పాడేస్తున్నారు.. అడిగి అడగకుండానే మనసులోకి వచ్చేశావే అంటూ కవితలు రాసేస్తున్నారు.. నీ చిత్రాలు ఒక్కొక్కటీ చూస్తుంటే.. ఈ జన్మకి ఇది చాలనిపిస్తోంది అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించకుండా ఎక్కడ ఉన్నావే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఎందుకింత క్రేజ్‌.. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ స్పెషల్‌ ఏంటి?

మొన్నటి వరకు ప్రపంచానికి తెలియని పేరు ప్రియా ప్రకాష్‌.. కానీ ఒకే ఒక్క చిన్న వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది.. కళ్లతో చేసే ఎక్స్‌ప్రెషన్స్‌ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ వీడియోలో ఆమె హావభావాలకు ఏజ్‌తో సబంధం లేకుండా అంతా మంత్ర ముగ్దులయ్యారు. తన చిలిపి చూపులు, కంటి సైగలతో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది.

మలయాళ చిత్రం ఒరు ఆదర్ లవ్ పాటతో ఈ కేరళ కుట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.. ఒక్క వీడియోతోనే కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు వేలైంటన్స్‌ డే రోజు మరో వీడియోతో ముందుకొచ్చింది.. కొత్తగా వచ్చిన టీజర్‌లో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు, హీరో రోషన్‌కు మధ్య క్లాస్‌రూమ్‌లో సాగే సన్నివేశాన్ని చూపించారు. ఇద్దరి మధ్య కొంటె చూపులతో సాగిన ఈ టీజర్ వైరల్‌కే వైరలైంది. ఇప్పటికే యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. అప్‌లోడ్ చేసిన 15గంటల్లోనే 28లక్షల మందికి పైగా చూశారంటే ప్రియా సృష్టించిన సంచలన ఏంటో చెప్పక్కర్లేదు.

 

SHARE