ఆర్ ఐ జ‌హీర్ పై దాడి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి – ఆత్మ‌కూరులో భారీ ర్యాలీ

100

The bullet news  (Atmakuru)-ఆర్ ఐ జ‌హీర్ పై టీడీపీనేత చేసిన దాడికి నిర‌స‌గా ఆత్మ‌కూరులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.. దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు.. వారి ఆందోళ‌న‌కు వైసీపీ నాయకులు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ప‌ట్ట‌ణంలో భారీ ర్యాలీ నిర్వ‌హించి ఆర్డీవో బాపిరెడ్డికి విన‌తిపత్రం అంద‌జేశారు.. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘ, వైసీపీ నాయ‌కులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగాయ‌న్నారు.. ప్ర‌శాంతంగా ఉద్యోగం చేసుకోవాల్సిన వారు భ‌యం గుప్పిట్లో విధులు నిర్వ‌ర్తించాల్సి వ‌స్తోంద‌న్నారు.. దాడి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. అనంత‌కుముందు ఆర్ ఐ జ‌హీర్ కుటుంబ స‌భ్యుల‌ను వైసీపీ నాయకులు ప‌రామ‌ర్శించి దైర్యం చెప్పారు.. ఆర్ ఐకి న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు అండ‌గా ఉంటామ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో రెవెన్యూ ఉద్యోగులు, వైసీపీ నాయ‌కులు భారీగా పాల్గొన్నారు..

SHARE