రూ.కోటి ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరింపులు

53

The bullet news(hyderabad)-నర్సింగ్‌ హోం నిర్వాహకుడిని కోటి రూపాయలు ఇ వ్వాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసిన ముగ్గురిని సైదాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో వ్యక్తి ఫరారీ లో ఉన్నట్లు పోలీసులు తె లిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణికాలనీ లో శ్రీగాయత్రి నర్సింగ్‌ హోంను డాక్టర్‌ రచనాసింగ్‌ ఠాకూర్‌, ఆమె భర్త డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ కుటుంబం వద్ద డబ్బులు దోచుకోవాలని డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ స్నేహితుడు అంబర్‌పేట న్యూమారుతీనగర్‌కు చెందిన రాచమల్ల సందీప్‌కుమార్‌(34), ఇదే ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న కల్వకుర్తికి చెందిన దర్శనం అఖిల్‌(26), ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎదుళ్లపారా తండాకు చెందిన గుగులోత్‌ బాలకిషన్‌(27) పథకం వేశారు.

             ముందుగా సికింద్రాబాద్‌లోని సీటీసీలో కంప్యూటర్స్‌ రిపేర్‌ చేసే జనగాం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్‌ జుబేర్‌ను ఆశ్రయించారు. జుబేర్‌ తాను డీఎంహెచ్‌ఓనంటూ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి నర్సింగ్‌ హోంపై పలు ఫిర్యాదులు వచ్చాయని, మీడియా ప్రతినిధి వద్ద పూర్తి వీడియో రికార్డులు ఉన్నాయని బుకాయించాడు. మళ్లీ ఏ విషయం అనేది తరువాత చెబుతానని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. జుబేర్‌ తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో అతడి ఫోన్‌ ట్రూకాలర్‌లో డీఎంహెచ్‌ఎం పేరిట రికార్డు చేయడంతో డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ కూడా తనకు ఫోన్‌ చేసింది డీఎంహెచ్‌ఓ అనే నమ్మాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు రాచమల్ల సందీప్‌కుమార్‌కు వివరించాడు. ఆసుపత్రి వీడియోలు ఎవరి వద్ద ఉన్నాయో డీఎంహెచ్‌ఓ ద్వారా తెలుసుకుని, సదరు మీడియా ప్రతినిధితో మాట్లాడుతానని నమ్మబలికి కాంపౌండర్‌ అఖిల్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ బాలకిషన్‌లతో కలిసి నాటకమాడారు. ఆసుపత్రి సంబంధించిన దృశ్యాలు చానల్‌లో రాకుండా ఉండాలంటే సదరు రిపోర్టర్‌ కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడని చెప్పారు. అంత డబ్బు ఇవ్వలేనని డాక్టర్‌ చెప్పడంతో చివరగా రూ.25 లక్షలకు బేరం కుదిర్చానని సందీప్‌కుమార్‌ డ్రామా ఆడాడు.
                    వీరి ప్రవర్తనపై ఆనుమానం వచ్చిన డాక్టర్‌ సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించగా, వారు విచారణ చేయగా నిందితుల గుట్టురట్టయింది. ఈ కేసులో రాచమల్ల సందీ్‌పకుమార్‌, అఖిల్‌, బాలకిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా, డీఎంహెచ్‌ఓ అంటూ ఫోన్‌ చేసిన జుబేర్‌ పరాలోరీలో ఉన్నట్లు సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కాట్న సత్తయ్య తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, ఓ పెన్‌డ్రైవ్‌ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
SHARE