దోచేశారు.. దొరికిపోయారు..

74

The bullet news (Nellore)- తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు నెల్లూరు సిసిస్ పోలీస్లు . సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ పీహెచ్ డీ రామకృష్ణ ఆదేశాల‌తో తన పర్యవేక్షణలో నెల్లూర నగర,రూరల్ పరిధిలోని ఇంటి నేరములు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్థులను శుక్రవారము సాయంత్రం నగరంలోని తల్పగిరి కాలనీ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశామన్నారు. నేరస్థులలో షమ్మి వెంకటేష్, కోడూరు సూర్య అను ఇద్దరు జిల్లాకు చెందివారు, రాధాకృష్ణ కుప్పస్వామి అలియాస్ ఇస్మాయిల్‌, ఒకరు చెన్నై ప్రాంతమునకు చెందిన‌వారని తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 4లక్షలు విలువైన వెండి, బంగారు వస్తువులను, ఒక లాప్ టాప్, 3టీవీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో వీరు చెన్నై ప్రాంతంలో కూడా ఇంటి నేరాలు చేసియున్నారని తెలిపారు

SHARE