నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

66

The bullet news (DEVOTATIONAL)- శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ జరగనుంది. విశ్వక్సేనుడు వసంత మంటపానికి చేరుకోగానే పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకని మిగిలిన మాడవీధుల్లో ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిపి పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపచేసే ప్రక్రియను జరుపుతారు. మరోవైపు 10,14 తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రూ.300 టికెట్లను తొలి 4 రోజుల్లో 12 వేలు, చివరి 4 రోజుల్లో 7 వేలు చోప్పున మాత్రమే విక్రయించామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. 13,14 తేదిల్లో నడకదారి దివ్యదర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను జారీ చేయబోమని, ఆ రెండు రోజుల్లో భక్తులందరూ సర్వదర్శనం ద్వారానే స్వామిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

SHARE