ఐదురోజులు స్వామివారి దర్శనానికి బ్రేక్…

114

THE BULLET NEWS – మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని తితిదే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.  ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.  ఈ నెల 24న ఈ సమావేశం జరగనుంది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు ఆగస్టు 12 నుంచి 16 వరకు తితిదే ముహూర్తం నిర్ణయించింది.
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా క్రతువు కోసం వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఆలయ సిబ్బంది కూడా బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. ఆ సమయంలో గర్భాలయంలో జరిగే మరమ్మతులు కూడా అర్చకులే చేస్తారు.

SHARE