తిరుమల తిరుపతి లడ్డు ధర భారీగా పెంపు

209

The bullet news ( Nellore ) _  టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహించే కల్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, భక్తి కార్యక్రమాలకు సప్లయ్‌ చేసే లడ్డూ ధరలను అధికారులు పెంచారు. ధరల వివరాల్లోకి వెళితే… చిన్న లడ్డూ ధర రూ. 25 నుంచి రూ. 50కి పెంచామని, కల్యాణం లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 200కి పెంచామని తెలిపారు. వడ ధర రూ. 25 నుంచి రూ. 100కి పెంచినట్లు వెల్లడించారు. సిఫార్సులపై ప్రసాదాలు ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించామని టీటీడీ తెలిపింది. రూ. 50 లడ్డూలను భక్తులకు కోరినన్ని ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.

SHARE