క‌లిచేడు కేంద్ర మైకా కార్మిక స్కూల్ విద్యార్దుల‌ నిరాహార‌దీక్ష‌కు టీఎన్ ఎస్ ఎఫ్ మ‌ద్ద‌తు

80

The bullet news (Saidhapuram)_  విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెబుతున్నా అవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి.. రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక సైదాపురం మండలం కలిచేడులోని కేంద్ర మైకాకార్మిక ఉన్నత పాఠశాల విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. గత మూడు రోజులుగా విద్యార్దులు, పూర్వ విద్యార్దులు చేస్తున్న నిరాహారదీక్షకు టీెెెఎన్ ఎస్ ఎప్ ( తెలుగునాడు విద్యార్థి సమైక్య) మద్దతు తెలిపింది.. ఈ సందర్భంగా టీెెెఎన్ ఎస్ ఎప్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర మైకా కార్మిక పాఠశాలకు రెగ్యులర్ హెచ్ ఎం, టీచర్స్ లేకపోవడంతో విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడంతో స్కూల్ అభివృద్దికి నోచుకోలేదన్నారు.. ఈ స్కూల్ కు నిధులు మంజూరు చేస్తే కలిచేడుతో పాటు దాని చుట్టు పక్కల ఉండే దాదాపు 20 గ్రామాల విద్యార్దులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.. అధికారులు వెంటనే స్పందించి రెగ్యులర్ టీచర్స్ ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట నాయకుల దృష్టికి ఈ స్కూల్ వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్తాన‌ని వెంక‌టేష్ హామీ ఇచ్చారు.. ఈ కార్య‌క్ర‌మంలో వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి బిల్లు సిసింద్రీ యాదవ్, టీఎన్ ఎస్ ఎఫ్ నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE