ఇదేనా ఫ్రెండ్లి పోలీసింగ్..?? – చిన్నబజారు పోలీసులపై టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఫైర్..

145

The Bullet News – Nellore

ఫ్రెండ్లి పోలీసింగ్ అని ఉన్నతాధికారులు ప్రచారం చేస్తున్నా క్షత్రస్థాయిలోని సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని
టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మొగల్ యస్ధాని ఆరోపించారు.. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కాకర్ల తిరుమల నాయుడు,అమ్రుల్లా ల పట్ల నెల్లూరు చిన్న బజార్ పోలీసులు వ్యవహరించిన తీరు అమానుశమన్నారు.. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని స్టేషన్ ఎస్సై కరీముల్లా, సీఐ పాపారావులు అసభ్యపదజాలంతో దూషించడం అమానుశారని, పోలీసులు తమ నిరంకుశ వైఖరిని వీడాలని యస్డాని అన్నారు.. విద్యార్థి నాయకులు అని కూడా చూడకుండా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామని బెదిరింపులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రవర్తించి ఉంటే తాము ఫైన్ కడతామని చెబుతున్నా పోలీసులు వినకుండా దూషించడాన్ని యస్డాని ఖండించారు.. పోలీసు వ్యవస్థపై గౌరవం పెరిగేలా పోలీసులు వ్యవహరించాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని, అంతేగాని ఇలాంటి దూషణలకు దిగగడం మంచిది కాదన్నారు..

గూడూరు…
నిబంధనలకు అనుగుణంగానే తమ నాయకులు యువనేస్తం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నా పోలీసులు నాయకులను దూషణను గూడూరు టిఎన్ ఎస్ ఎఫ్ నాయకులు అనసపురం వెంకటేష్ ఖండించారు.. బైక్ కీస్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు.. ఫైన్ కడతామని తిరుమల నాయుడు, అమృల్లా చెబుతున్నా వారు వినలేదని ఆరోపించారు.. పోలీసులు తమ వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు..

SHARE