నేడు నీట్‌…

129

THE BULLET NEWS –

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష “నీట్‌”ను నేడు నిర్వహించనున్నారు.

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, రాజమండ్రిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్‌లో 49,210 మంది, తెలంగాణలో 50,856 మంది నీట్‌ రాస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 7.30 నుంచి 9.30 గంటల్లోపు చేరుకోవాలి.

ఆ తర్వాత వచ్చినవారిని లోపలికి అనుమతించరు.

దేశవ్యాప్తంగా దాదాపు 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్‌ఈ తెలిపింది.

నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, రింగులు, చైన్‌లు, వాచీలు నిషిద్ధo.

ఎలక్ట్రానిక్‌ వస్తువు (ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్‌లు, కాలిక్యులేటర్లు)లను అనుమతించబోరు.

అమ్మాయిలు జడ వేసుకుని పరీక్షకు రావాలని పేర్కొన్నారు.

అబ్బాయిలు ఫార్మల్‌ డ్రెస్‌లో రావాలని బిగుతుగా ఉన్న జీన్స్‌ ధరించకూడదన్నారు.

అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని తెలిపారు.

పరీక్ష రాయడానికి పెన్ను, పెన్సిల్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారని చెప్పారు.

 

 

SHARE