ఈ రోజు నుండి రంజాన్‌ తోఫా పంపిణీ…

97

THE BULLET NEWS (VIJAYAWADA)-ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న రంజాన్‌ తోఫాను ఈరోజు నుండి పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫాను అందించనున్నారు. రేషన్‌ షాపుల్లో ఈరోజు నుండి ఈనెల 17 వరకు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపులకు తోఫా సరుకులను సరఫరా చేశారు అధికారులు. ఒక్కో రేషన్‌ కార్డుపై ఐదు కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, 100 ఎంఎల్‌ నెయ్యిని అందిస్తారు. ఈ రంజాన్‌ తోఫా పంపిణీని నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

SHARE