రేపే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం..??

91

The bullet news (Karnataka)_ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష(బీజేపీఎల్పీ) భేటి కార్యక్రమంలో నాయకుడిని ఎన్నుకోనున్నట్లు కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప వెల్లడించారు. భేటీ అనంతరం వెంటనే ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో పరేడ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, బీజేపీఎల్పీ భేటీలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, జేపీ నడ్డా, ప్రకాశ్‌ జవదేకర్‌లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేతగా యడ్యూరప్పను పార్టీ నేతలు ఎన్నుకున్నారు. అక్కడి నుంచి యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసిన యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖను అందజేశారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది.

 

SHARE