ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు న‌డుం బిగించిన గూడూరు డిఎస్పీ రాంబాబు..

74

The bullet news (Gudur)-రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు గూడూరు డిఎస్పీ రాంబాబు న‌డుం బిగించారు. స‌మస్యాత్మ‌క ప్రాంతాలను గుర్తించిన ఆయ‌న అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు రంగం సిద్దం చేశారు.. కాసేప‌టి క్రితం ప్రధాన కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ప‌ర్య‌టించిన ఆయ‌న వ్యాపారస్తులతో మాట్లాడారు.. వారికి ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.. రోడ్డుకు అడ్డంగా వాహ‌నాలు నిలిపి, ట్రాపిక్ అంత‌రాయం క‌ల్గించే వారి బైక్ నెంబ‌ర్ల‌ను స్థానిక సిఐ, ఎస్ ఐల‌ను స‌మ‌చారం చేర‌వేస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల‌ని పాటించిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు..

SHARE