ప్రజలందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు…

90

THE BULLET NEWS (CHITTOR)-ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి అమరనాథ్ రెడ్డి  పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం లోని బొమ్మాలకుంట, పెద్ద పంజాణి, చలమంగలం, ముత్తుకూరు, లింగాపురం, గ్రామ పంచాయతీ ల లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మాలకుంట లో రూ. 6 లక్షల తో నిర్మించిన సిమెంట్ రోడ్డు, పెద్ద పంజాణి చలమంగలం గ్రామాల్లో రూ. 20 లక్షలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రాలు, రూ.5 లక్షల.తో సిమెంట్ రోడ్, చలమంగలం గ్రామంలో రూ. 10.50 లక్షలతో,చిన్నెపల్లిలో రూ.5 లక్షలతో సిమెంట్ రోడ్ల ను ప్రారంభించారు. అలాగే అంగనవాడి కేంద్రాలలో బాలామృతుమ్ ను పంపిణీ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది ఫలాలను అదించడమే ధ్యేయంగా కృషి చేస్తుందని అన్నారు. రాజకీయాలకు,పార్టీలకతీతంగా అర్హులైన లబ్దిదారులకు వందశాతం లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని, గత మూడేళ్ళ పాలనలో జరిగిన అభివద్ది,సంక్షేమంపై తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కషి చేయడమే ఇంటింటికీ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమఫలాలు ఏదో రూపంలో అందుతోందని ఇంకా అర్హులైన లబ్దిదారులెవరైన ఉన్నట్లయితే ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లో మంత్రికి మహిళలు మంగళహారతులు పట్టగా, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలు గ్రామలలో టిడిపి జండాలను ఎగురవేసి పంచియతీల పరిధిలో జరిగినఅభివృధ్ధి, అందిస్తోన్న సంక్షేమ ఫలాలు గురించి గ్రామస్థులకు తెలియజేశారు. అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో  స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE