నేకోరిగిన భారీ వృక్షం… వాహన రాకపోకలకు అంతరాయం…

80

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు సెంటర్ నుండి ఇనమడుగు, వేగురు, ముదివర్తి, ఊటుకూరు, రామతీర్థం పోయ ప్రధాన రోడ్ మార్గం పై 150 సంవత్సరాల వయస్సు కలిగిన భారీ వృక్షం నెలకు ఒరిగింది.దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు రోడ్డు పై నిలిచిపోయాయి. దాదాపు2 గంటలపాటు వాహనాలు అక్కడే నిలబడిపోయేయి.150 సంవత్సరాల పాటు తమకు నీడను ఇచ్చిన వృక్షం నెలకు ఒరగడం బాధగా ఉందని స్థానికులు వాపోతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్ & బి , ఫైర్ సిబ్బంది వృక్షాన్ని రోడ్డు పై నుండి తొలగించే యత్నాలు చేస్తున్నారు.

SHARE