అంతరిక్షంలో గోధుమ పంట

81

THE BULLET NEWS-అంతరిక్షంలో గోధుమ పంటను పండించడానికి నాసా ప్రయోగాలు చేస్తోంది. దాని కోసం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల పంట మూడు రెట్లు వేగంగా పెరుగుతుంది. గోధుమపంటపై నిరంతరం వెలుతురును ప్రసరించడం వల్ల త్వరగా పెరగడానికి, అలాగే త్వరగా పంట చేతికి వచ్చేందుకు అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
భూమిపై మొక్కలు పెరగడానికి నాసా ఉపయోగించే పద్ధతినే మేము పాటించాము. దాని వలనే జన్యుపరమైన వేగం పెరుగుతుంది అని ఆస్ట్రేలియాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయ పరిశోధక శాస్త్రవేత్త లీ హీకీ తెలిపారు.
ముందుగా ఈ పరిశోధనల కోసం ఆరు తరాల గోధుమ, బార్లీ పంటల పై ప్రయోగాలు చేశామన్నారు.
ఈ పంటలపై గాజు గదుల్లో ప్రయోగాలు చేస్తున్నామన్నారు. వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా పంటల పెంపకం అనేది జరుగుతుందన్నారు. అన్నింటిని తట్టుకుని నిలిచే విధంగా వీటిని రూపొందిస్తున్నామన్నారు. 2050 సంవత్సరానికి భూమి మీద దాదాపు 60 నుంచి 80 శాతం ఎక్కువ ఆహారాన్ని తొమ్మిది బిలియన్ల మందికి అందించాల్సిన అవసరం ఉంది.దీంతో పంటల ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. డో ఆగ్రో సైన్సెస్తో భాగస్వామ్యం ఏర్పరచుకుని డీ ఫెరడే రకాన్ని తయారు చేసినట్లు లీ తెలిపారు.
డీ ఫెరడే అనేది అధిక ప్రోటీన్లు కలిగి ఉన్న తృణధాన్యం. దీనిలో గోధుమ కూడా కలిసి ఉండటం వల్ల ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుందని తెలిపారు. స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఉపయోగించి అనేక రకాల పంటలను పండించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

SHARE