రేపటి సీఎం సభకు ఆటంకం..?

120

THE BULLET NEWS (NAIDUPETA)-నెల్లూరు జిల్లాలో జోరున వర్షం కురుస్తోంది. రేపు జిల్లాలో జరగనున్న నవనిర్మాణ దీక్ష ముగింపు సభ కోసం నాయుడుపేటలోని ఏఎల్సియం మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షముతో సభా ప్రాంగణం అంతా జలమయం కావడం జరుగుతున్న ఏర్పట్లకు వర్షం తీవ్ర ఆటంకంగా మారింది. నాయుడుపేటలో రేపు సిఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో అధికారులు, నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. రేపు కూడా వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా ఉండి వాతావరణం అనుకూలించకపోతే సిఎం పర్యటన వాయిదా పడుతుందా అనేది సందిగ్ధంలో ఉన్నారు.. వారం రోజుల పాటు సాగిన నవనిర్మాణ దీక్ష ముగింపు సభను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భవిస్తుండటం మరో వైపు వాతావరణం ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ప్రత్యన్మయ ఏర్పాట్లపై కూడా ఆలోచిస్తున్నారు..

SHARE