దివ్యాంగులకు సాయం చేయడం దేవుడిచ్చిన వరం – ఎమ్మెల్యే కోటంరెడ్డి.

16

THE BULLET NEWS (NELLORE)-స్నేహితులు, దాతలు, అదికారులు, నాయకుల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యేకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఇవాళ ముగ్గురు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనస్సున్న మారాజుల సహాయ సహకారాలతో ఇప్పటి వరకు దాదాపు 500 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, హ్యాండ్ స్టిక్స్, వీల్ చైర్లు అందజేశామన్నారు.. మనం దివ్యాంగులకు సాయం చేస్తే ఆ భగవంతుడు మన కుటుంబానికి అండగా ఉంటారన్నారు.. సాయం చేసేవాళ్లు ముందుకెు రావాలని ఆయన కోరారు..

SHARE