ఏపీ రాజ‌కీయాల‌ను మార్చేసిన ట్వీట్

196

The bullet news (Amaravathi)- ఓ ట్వీట్ కొంద‌రి ఆశ‌ల‌ను స‌జీవం చేసింది.. మ‌రికొంద‌రిలో హ‌మ్మ‌య్యా.. చాలు అన్న భ‌రోసాని నింపింది.. బంధాన్ని బ‌లిష్టం చేసింది.. కానీ ఆదే ట్విట్ కొంద‌రి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.. అప్ప‌టిదాకా అనుకున్న‌దంతా ఆ ట్విట్ తో తుడిచిపెట్టుకుపోయింది.. ఓ ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో గాని ఓ ట్విట్ మాత్రం కొంద‌రి జీవితాల‌ను త‌ల‌కిందులు చేసింది. ఇంత‌కీ ఎవ‌రు చేశారు ఆ ట్వీట్..? ఇవ‌న్నీ తెలియాంటే ఈ క‌థ‌నం చూడాల్సిందే..

తెలుగుదేశం పార్టీ నంద్యాల‌లో బంప‌ర్ గెలుపు టీడీపీ శ్రేణుల‌తో పాటు రాజకీయ విశ్లేష‌కుల‌ను కూడా ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.. టీడీపీ శ్రేణులు పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించినా నంద్యాల‌లో గెలుపు పై వారు కూడా అనుమానంలో ఉన్నారు. నంద్యాల గెలుపుతో అధికార పార్టీ మీద రాష్టంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని నిరూపిస్తామ‌ని చెప్పుకొచ్చిన వైసీపీ బొక్క‌బోర్లాప‌డింది..ఈ విజయం మిత్రపక్షాలైన తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.. ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీల మధ్య సంబంధాలపై అటు టీడీపీతో పాటు ప్ర‌తిప‌క్షాలు సైతం అనుమానాలు వ్య‌క్తం చేశాయి.. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవడం.. రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలతో తెలుగుదేశంపార్టీలో అల‌జ‌డి మొద‌లైంది..

నంద్యాల ఉప ఎన్నికకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరిగింది. నంద్యాల‌లో ఫ‌లితాల అనంత‌రం బిజేపీతో వైసీపీ పొత్తు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు.. కానీ ఫ‌లితాల అనంత‌రం సీన్ రివ‌ర్స్ అయింది.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ 28 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడంతో ప్రధాని నరేంద్రమోదీ విజేత బ్రహ్మానందరెడ్డిని అభినందించడమే కాకుండా.. తెలుగుదేశంపార్టీని విలువైన మిత్రుడిగా పేర్కొన్నారు.. మోదీ ట్వీటు బీజేపీ-తెలుగుదేశంపార్టీలో చర్చనీయాంశమయ్యింది.. మ‌రో ప‌క్క వైసీపీని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.. ఈ వ్య‌వ‌హారాన్ని వైసీపీ అధినేత జీర్ణించుకోలే క‌పోతున్నారని లోట‌స్ పాండ్ వ‌ర్గాల టాక్ మ‌రో్ ప‌క్క బిజేపీలో ఉన్న కొంతమంది నేతలు సైతం జీర్ణించు కోలేకపోతున్నార‌ట‌. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు కూడా మోదీ ట్వీట్‌ నిరాశ కలిగించింది.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఆలోచన చేస్తున్నారు..

SHARE