తెల్లవారు జామున నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

164

The bullet news (Thada)_ నెల్లూరు జిల్లా తడ మండలం ప‌న్నం గాడు వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.. ముందు వెళుతున్న లారీ ఢీని టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది.. ఈ ఘ‌ట‌న‌లో .ఇద్దరు మృతి చెంద‌గా మ‌రో ఐదు మందికి గాయాలయ్యాయి. మృతులు కృష్ణా జిల్లా చెలకూరు వాసులు గా ప్రాధ‌మిక స‌మాచారం..
కృష్ణా జిల్లా చెలకూరుకు చెందిన ఐదుమంది అయ్య‌ప్ప మాల‌దార‌ణ చేసి శ‌బ‌రిమ‌లైకు బ‌య‌ల్దేరారు.. ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో త‌డ మండలం పన్నంగాడు వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి ఢీ కొట్టింది.. ఈ ప్ర‌మాదంలో రామాంజనేయులు(30), రెడ్డి రాహుల్(8) అక్క‌డిక్క‌డే మృతిచెంద‌గా.. పొలా త్రినాథ్ నాయుడు, బోని శ్రీనివాసులు, గొట్టాపు తవితి నాయుడు, కోటిపల్లి శివ, చుట్టా రాంబాబులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు..

SHARE