నెల్లూరుజిల్లా గూడూరులో ప‌ట్ట‌ప‌గ‌లు జంట హ‌త్య‌లు..

102

The bullet news (Gudur)-  నెల్లూరుజిల్లా గూడూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి.. పట్టణంలోని ఇందిరానగర్ లో చిన్నజయరామయ్య(32), పెద్ద జయరామయ్య (35) అనే ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్దులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపారు.. గతంలో మృతులిద్దరూ అదే ప్రాంతానికి చెందిన నారాయణ అనే వ్య‌క్తి హత్య కేసులో నిందితులు.. నారాయ‌ణ హ‌త్య అనంత‌రం మృతుల కుటుంబాలు కోట మండలం విద్యానగర్ లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్క‌డే నివ‌సిస్తున్నారు..

ఇవాళ వ్య‌క్తిగ‌త ప‌నుల మీద చిన్నజయరామయ్య, పెద్ద జ‌య‌రామ‌య్య ఇందిరా న‌గ‌ర్ కు చేరుకున్నారు.. అప్పటికే కాపు గాచిన ప్రత్యర్దులు పక్కా వ్యూహంతో చిన్నజయరామయ్య, పెద్ద జయరామయ్యలను అత్యంత దారుణంగా నరికి చంపారు. మృతుల కుటుంబాల‌కు గ‌తంలో పాత‌క‌క్ష‌లున్నాయి.. రెండు నెలల క్రితం ఇందిరానగర్ లో నారాయణ అనే వ్య‌క్తి హత్యకు గురయ్యాడు. ఆ హత్యను పెద్ద జ‌య‌రామయ్య, చిన్న జ‌య‌రామ‌య్య చేశారని ప్రత్యర్దులు పోలీసులకు పిర్యాదు చేసి ఉన్నారు.. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.. ఈ క్ర‌మంలోనే నిందితులిద్ద‌రినీ ప్ర‌త్య‌ర్దులు అతి కిరాత‌కంగా హ‌త్య చేశారు.. పట్టపగలు జరిగిన ఈ జంట హత్యలతో గుడూరు ఇందిరానగర్ లో కలకలం రేగింది.. హత్యానంతరం ఘటనాస్థలానికి చేరుకున్న గూడూరు పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు..

SHARE