అయ్యో.. ఆమె ఎవ‌రో తెలుసా…?

98

The bullet news (Delhi)-  భారత యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తాజాగా ఓ యువతితో కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఫొటోని చూసిన వారంతా పాండ్య ప్రేమలో పడ్డాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘పాండ్య త్వరగా ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పెయ్‌’ అంటూ అభిమానులు పెద్ద సంఖ్యలో కామెంట్లు గుప్పించారు. దీనికి పాండ్య ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ‘మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి’ అని అభిమానుల వూహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో పాండ్య ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆసీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఈ నెల 7న రాంచీలో జరగనుంది.

SHARE