వాళ్లు నాపై దుష్ప‌చారం చేస్తున్నారు..

86

THE BULLET NEWS (NELLORE)-ఏసీబీ తనను అరెస్టు చేయబోతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్నవార్తలపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్పందించారు.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వైసీపీ పై మండిపడ్డారు.. ఉదయగిరి అభివ్రుద్ది చూసి ఓర్వలేక మేకపాటి సోదరులు తనపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విదర్బ కాంట్రాక్ట్ పనుల్లో తానెక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. వైసీపీ నాయకులు నాపై సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.. వారందరిపై పరువునష్టం దావా వేస్తాననన్నారు.. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతానని ఆయన సవాల్ చేశారు..

SHARE