నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారు..?

135

The Bullet News ( Vijayawada ) – నిరుద్యోగ భృతి పొందడానికి ఉద్యోగం రాకుండా ఎక్కువ వయస్సు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారా? నిరుద్యోగులు ఎంత మంది ఉంటే అంతమందికీ భృతి ఇవ్వరా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ ప్రధానంగా దరఖాస్తుదారుల్లో ఎవరైతే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారో వారికే ప్రాధాన్యం ఇస్తారు. ఒక వేళ ఒకే వయస్సుతో అనేక మంది ఉన్నట్లయితే వారిలో అవసరమైన విద్యార్హత ఎవరు పొందారో వారినే సీనియర్‌గా పరిగణిస్తారు.

వయస్సు, విద్యార్హతలు కూడా ఒకే రకంగా ఉండి, ఎటూ నిర్ణయం తీసుకోలేని విధంగా ఉన్న పరిస్థితుల్లో మార్కులను కొలమానంగా తీసుకుంటారు. మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగం రాని వారిని సీనియర్లుగా గుర్తిస్తారు. మరోవైపు ఎవరైనా దరఖాస్తు దారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉంటే వారికి నిరుద్యోగభృతికి అర్హులుగా పరిగణిస్తారు.రాష్ట్రంలో జన్మించిన వారికే ఇస్తారు. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డులు ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుని పేరు ఉపాధి కల్పన కేంద్రంలో నమోదయి, ఆన్‌లైన్‌లో రిజిస్టరై ఉండాలి. కనీసం 10+2, వరకు చదివి ఉండాలి, అదే టెక్నికల్‌ అయితే కనీసం ఐటిఐ ఉత్తీర్ణులవ్వాలి. 18-35 ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భృతి పేద కుటుంబాల వారికే వర్తింప చేస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తారు. సంబంధిత కుటుంబం రేషన్‌ తీసుకుంటూ ఉండాలి. కారు ఉన్నా, స్వయం ఉపాధి పథకాల్లోగాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులయితే అనర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఎక్కడైనా ఇప్పటికే పని చేస్తున్నా, ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించినా క్రిమినల్‌ ఆపెన్స్‌లో ఉన్నా అర్హత కోల్పోతారు. దరఖాస్తు చేసుకున్న వారు నైపుణ్యా భివృద్ధిలో శిక్షణ పొందాలి. మొత్తం ఆన్‌లైన్‌ లోనే ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది.

SHARE