పీకే బృందానికి ఊహించ‌ని షాక్…

265

The bullet news (Kadapa)-జగన్ రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారు..? ఆయన బ్రుందం జగన్ పాదయాత్రలో చేస్తున్నదేంటి..? కడపలో పీకే బృందానికి ఎదురైన చేదు అనుభవమేంటి..? ఇంతకీ కడపలో ఏం జరిగింది..? 2019లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పాదయాత్రలతో హోరెత్తిస్తున్నారు..జగన్ కసికి తోడు పీకే ఆలోచనలు తోడవ్వడంతో పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్లోంది..

వెళ్లిన ప్రతిచోటా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ వెళ్తున్నారు.. కడపలో జగన్ కి జనం జననీరాజనం పలికారు.. ఇదంతా ఓ వైపు జరుగుతుంటే మరో వైపు జగన్ రాజకీయ సలహాదారుడు పీకే బృందం పాదయాత్రలో హడావుడి చేస్తోంది.. పాదయాత్ర జరుగుతున్న చోటుకు వారం పదిరోజులు ముందే వెళ్లి అక్కడి ప్రజల స్పందన ఎలా ఉండబోతోందంటూ ముందుగానే జగన్ కు సమాచారం చేరవేస్తోంది.. ఇడుపుల పాయలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను దగ్గరుండి పర్యవేక్షించడానికి పీకే బృందం కడపకు చేరుకుంది..

వారికి పార్టీ ముఖ్యులే ఓ హోటల్ లో రూములు బుక్ చేశారట.. ఉదయం నుంచి రాత్రి వరకు జగన్ తో తిరుగుతూ ప్రజా వాణిని తెలుసుకుంటున్న పీకే బ్రుందం రాత్రి కల్లా హోటల్ కు వెళ్లి పోయి అక్కడే భోజనాలు చేస్తారట.. అయితే కడపలో పాదయాత్ర ముగియడంతో పీకే బ్రుందం కూడా కర్నూల్ వెళ్లేందుకు సిద్దమయ్యే తరుణం లో వారికి హోటల్ యాజమాన్యం రూపంలో షాక్ తగింది.. లక్షల రూపాయల బిల్లును చెల్లించి కదలాలంటూ హోటల్ వాళ్లు గొడవకు దిగడంతో పీకే బృందం కూడా ఎదురుదాడికి దిగింది.. దీంతో ఈ సమాచారం కాస్త వైసీపీ ముఖ్య నాయకులకు తెలియడంతో వారు వచ్చి సర్దుబాటు చేశారట.. బిల్లును తాము చెల్లిస్తామని వారిని వెళ్లినివ్వకుండా ఓ ముఖ్య నేత జోక్యం చేసుకోవడంతో హోటల్ వారు వారిని వదిలేశారట..

SHARE