యువత భవిష్యత్ కోసమే మా పోరాటం – విద్యార్ది విభాగం నేత గున్నపనేని పెంచలనాయుడు.

35

THE BULLET NEWS (VENKATACHALAM)-నెల్లూరుజిల్లా వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.. అరెస్టులు, ఆందోళనతో వైసీపీ శ్రేణులు రోడ్డెక్కుతున్నారు.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు, వెంకటాచలంలో జడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్యఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రిలే దీక్షలు జరుగుతున్నాయి.. ఇవాళ శిబిరం వద్ద వైసీపీ విద్యార్ధి విభాగ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, గున్నపనేని పెంచలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసమర్దత వల్లే ఇప్పుడు అందరూ రోడ్డుమీదకు వస్తున్నారన్నారు.. ప్రత్యేకహోదాతోనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. యువత భవిష్యత్ ను ద్రుష్టిలో ఉంచుకున్న వైసీపీ అధినేత జగన్ ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి వైసీపీ ఎంపీలతో కలిసి పోరాడాలన్నారు. హోదా వచ్చే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని పెంచల నాయుడు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల నాయకులు మందల పెంచలయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ భాష, మండల కోఆప్షన్ సభ్యులు హుస్సేన్, ఎంపీపీ తలపల అరుణ, సర్పంచ్ మణెమ్మ, విద్యార్ధి నాయకులు సాధిక్, వెంకటేష్, కాలేష, ఇస్మాయిల్, నరేష పాల్గోన్నారు..

SHARE