రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కొత్త‌ప‌ల్లి వాసుల‌కు అండ‌గా వాల్మీకి సేవాద‌ళ్

117

The bullet news (Kurnool)_ పొట్టికూటి కోసం తెలంగాణా వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన క‌ర్నూల్ జిల్లా ఆలూరు మండ‌లం కొత్త‌ప‌ల్లివాసుల‌ను కర్నూలుజిల్లా వాల్మీకి సేవాదల్ టీం ఆదుకుంది.. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చింది.. రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు రూ.30000 న‌గ‌దు అంద‌జేసిన‌ట్లు వాల్మీకి సేవాద‌ల్  గౌర‌వాధ్య‌క్షులు శ్రీగిరి ఆదిశేష‌య్య ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు  కుంపటి కృష్ణయ్య. తలారి కృష్ణ నాయుడు, రామకృష్ణ, గుడిసె సీతారముడు మాట్లాడుతూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్ప‌యిన కుటుంబాల‌ను రాష్ట ప్ర‌భుత్వం ఆదుకోవాల‌న్నారు.. వెంట‌నే ఒక్కొక్క‌రికి రూ.10ల‌క్ష‌లు వంతుల ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. దాంతో పాటు చంద్ర‌న్న బీమా అంద‌జేయాల‌న్నారు..  క‌రువు ప్రాంతంగా ఉన్న కొత్త‌ప‌ల్లిలో ఉపాధి క‌ల్పించాల‌ని, వ‌ల‌స‌ల‌ను నిరోధించాల‌ని వారు  ప్ర‌భుత్వాన్ని డిమాండ్  చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో  సేవాద‌ళ్ నాయ‌కులు  నాగరాజు, ప్రసాద్, కాకి వీరేశ్, అరికేర వీరన్న, ఆనంద్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

SHARE