వర్మ..‘బహిరంగవాసి’!

117

The bullet news (Cinema)- పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కి సంబంధించిన ఏ సినిమా విడుదలైన దానిపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏదో ఒక కామెంట్‌ చేస్తూనే ఉంటారు. ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై కూడా వర్మ కామెంట్‌ చేశారు. ‘ గోళ్లు, పళ్లు లేని పులిని నేనెప్పుడూ చూడలేదు. బెల్ట్‌తో కొడుతున్న సన్నివేశాలు చూసి నిర్ఘాంతపోయాను. మరో షాకింగ్‌ అంశం ఏంటంటే.. ఈ పులి దూకకుండా పాకుతోంది’ అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా వర్మ..‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ఓ పోస్టర్‌లో పవన్‌ ఫొటోకి బదులు తన ఫొటోని మార్ఫ్‌ చేసిన ఇమేజ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టర్‌కి ‘బహిరంగవాసి’ అనే టైటిల్‌ పెట్డడం వైరల్‌గా మారింది. వర్మ ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే లక్షల్లో లైక్‌లు వచ్చాయి. విభిన్నమైన వ్యాఖ్యలతోనే కాదు విభిన్న నేపథ్యాలతోనూ సినిమాలను తెరకెక్కిస్తుంటారు వర్మ. తాజాగా మరో సంచలన సినిమాకు వర్మ తెరలేపారు. మియా మల్కొవా అనే పోర్న్‌స్టార్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దీనికి ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరు పెట్టినట్లు వెల్లడించారు. మరోపక్క ‘కడప’ అనే అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ను కూడా వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జునతో ఓ సినిమా తీస్తున్నారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతోనూ వర్మ బిజీగా ఉన్నారు.

SHARE