The bullet news ( GUDUR)_ ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారానికి తెగబడ్డ వర్షిత్ బతికే అర్హత లేదని ఎబివిపి నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ అన్నారు.. వర్షిత్ ను వెంటనే ఉరి తియ్యలంటూ గూడూరు లో ఎబివిపి నాయకులు ఆందోళన చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి పై అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్యంటు మండిపడ్డారు..12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలు చేస్తే వారిని ఉరి తియాలనే చట్టం రాష్టప్రతి ఆమోదం పొందిన నేపధ్యంలో నిందితునికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.. మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా వారిలో భయాన్ని కల్గించాలన్నారు.. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శ చిన్న, సురేంద్ర, జార్జ్ ,తేజ ,క్రాంతి తదితరులు పాల్గొన్నారు

SHARE