శాడిస్టు భర్త రాజేష్‌కు పురుషత్వ పరీక్ష!

80

The bullet news (chittor)_ కట్టుకున్న భార్యకు తొలిరాత్రే నరకం చూపించిన శాడిస్టు భర్త రాజేష్ అసలు బండారం బయటపడింది. అసలు విషయం దాచిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆమెపై అరాచకంగా దాడిచేయడానికి గల కారణం ఏంటో పోలీసుల విచారణలో తెలిసిపోయింది. దాంపత్య జీవితానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబుతుందనే శైలజపై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు పోలీసుల ముందు రాజేష్ ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసుతోపాటు గృహహింస, చీటింగ్ కేసులు కూడా పెట్టారు. దాంపత్య జీవితానికి పనికి రానని తెలిసి కూడా పెళ్లిచేసుకోవడం.. దానికి అతని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఈ ముగ్గురిపైనా కేసులు పెట్టారు.

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు చిన్న దామరగుంట గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి కుమారై శైలజకు డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులను వధువు ఇంటికి తీసుకువచ్చారు. సంప్రదాయం ప్రకారం వధువు ఇంటి వద్ద శోభనం ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ తొలి రాత్రే శైలజపై దాడికి తెగబడ్డాడు. పెదవులు కొరికి, ముఖంపై పిడుగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. తీవ్ర గాయాలతో శోభనం గది నుంచి బయటికి వచ్చిన శైలజను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుళ్లారు. బాధితురాలు ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

SHARE