మూతపడిన వేగూరు ఇసుక రీచ్…

104

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పరిధిలోని ఇసుక రీచ్ నుంచి పోయే ఇసుక ట్రాక్టర్ ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాబోవు రోజుల్లో భూగర్భజలాలు అడుగంటి పోతాయని గతంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు,ధర్నాలు చేశారు. ట్రాక్టర్ లను అడ్డుకున్నారు.
ఈ విషయం పై మైనింగ్ అధికారులు వివరాలు స్వీకరించి వేగురు పరిధిలోని ఇసుక తొవ్వకాలను నిలిపివేయాలని ఎమ్మెరో కి లేఖ పంపేరు. ఈ లేఖపై తహశీల్దార్ రామలింగేశ్వరరావు ఇనమడుగు,వేగురు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్తులు కోరిక మేరకు ఇసుక తొవ్వకాలను నిలిపివేయాలని మైనింగ్ అధికారులు తెలిపారన్నారు . ఈ రీచ్ లో ఇసుక తొవ్వకాలు జరిగితే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో కోవూరు ఎస్.ఐ వెంకటరావు, ఆర్.ఐ లు ఇనమడుగు,వేగురు గ్రామస్థులు పాల్గొన్నారు.

SHARE