టీడీపీ హయాంలో వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి శూన్యం.. – సమన్వయకర్త బొమ్మిరెడ్డి

168

The Bullet News (  Venkata giri ) – అధికార పార్టీ అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. . వైఎస్సార్ కుటుంబం పేరుతో ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్న ఆ పార్టీ నేతలు
పల్లెనిద్ర పేరుతో ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీ అధినేత ఆదేశాలతో ఇవాళ్టి నుంచి పల్లెనిద్ర కార్యక్రమం వెంకటగిరి నియోజవర్గంలో ప్రారంభమైంది.. నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కలువాయి మండలం ఎరుబోట్లపల్లిలో పల్లెనిద్ర చేశారు.. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ వరప్రసాద్ హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి ప్రజలతో మాట్లాడారు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తమ అధినేత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి స్పాట్ లొనే పరిష్కరిస్తానన్నారు.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే జగన్ చేప్పటిన ప్రజా సంకల్ప యాత్రని అందరూ ఆదరించాలని ఆయన కోరారు.. తెలుగుదేశం హయాంలో వెంకటగిరి అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు.. ముఖ్యంగా దళితులను అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు.. ఈ కార్యక్రమంలో జపిటీసీ అనిల్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు..

SHARE