THE BULLET NEWS (VENKATAGIRI)-అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఆదుకుంటున్నారు వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ. వెంక‌ట‌గిరిలో ఏ నిరుపేద చ‌నిపోయినా అంత్య‌క్రియ‌ల నిమిత్తం త‌న స్వంత డబ్బును అంద‌జేస్తూ త‌న దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.. ఇవాళ 24వ వార్డులో నివాసం ఉంటున్న న‌ర‌సమ్మ మృతిచెందారు.. విష‌యం తెలుసుకున్న శార‌దా బాల‌కృష్ణ ఆ కుటుంబాన్ని ప‌రామర్శించారు.. అంత్య‌క్రియ‌ల నిమిత్తం రూ.3 వేలు ఆర్దిక సాయం అంద‌జేశారు.. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీల‌కు అతీతంగా ఈ సేవా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.. త‌న‌ను ఈ ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు రాజ‌కీయంగా ఎంత‌గానో అద‌రిస్తున్నార‌ని అలాంటి వారికి ఏం చేసినా త‌క్కువే అవుతుంద‌న్నారు.. త‌న జీవితాంతం ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తాన‌ని ఆమె తెలిపారు.. ఆమె వెంట టీడీపీ నాయ‌కులు దొంతు గోపీ, రంగినేని భవాని మరియు ఆ ప్రాంత ప్రజలు​ ఉన్నారు..

SHARE