మర్రిపాడు బాలుర వసతి గృహంలో విజిలెన్స్ తనిఖీలు..

146

The Bullet News ( Marripadu)_

మర్రిపాడు మండల కేంద్రంలోని బాలుర వసతిగృహాన్ని విజిలెన్స్ డిఎస్పి వెంకటయ్య తన సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలుర వసతి గృహంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తునారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బాలుర వసతి గృహంలోని పిల్లలకు కల్పించిన సౌకర్యాల చేరుతున్నాయా లేదని ఆరాతీశారు. వసతి గృహంలో పరిశుభ్రత ను పరిశీలించారు. వసతి గృహాలులో వసతులును పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమము ఏ ఈ బాలకోటయ్య ఎఫ్ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ , వార్డెన్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

SHARE