టాలీవుడ్ స్టార్‌లకు షాకిచ్చిన విజయ్‌ దేవరకొండ

119

THE BULLET NEWS -అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. ఈసినిమాలో యూత్‌ ఆడియన్స్‌ కు ఫేవరెట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ ఆన్‌లైన్‌ పోల్స్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌ 2017 లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్‌లకు షాక్‌ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రానా, ఎన్టీఆర్‌ లాంటి హీరోలకు వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచాడు.

ఈ లిస్ట్‌లో పలు టీవీ రియాలిటీ షోలలో పాల్గొన్న బసీర్‌ అలీ తొలి స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 20 స్థానాలు ముందుకు వచ్చాడు విజయ్‌. తరువాతి స్థానాల్లో వరుసగా ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటిలతో ఇతర టాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

SHARE