సహారా స్టేడియంలో గాయపడ్డ విరాట్ కోహ్లీ

35

THE BULLET NEWS -భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య సహారా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్ 2 బంతిని ఆమ్లా మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ బాదాడు. అయితే ఆ బంతిని ఆపేందుకు విరాట్ తన మోకాలిపై డైవ్ చేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో గ్రౌండ్‌లోకి వచ్చిన ఫిజియో అతన్ని ట్రీట్‌మెంట్ కోసం తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ అనంతరం కోహ్లీ తిరిగి ఆటలో పాల్గొననున్నాడు.

SHARE