వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో తీరంలో విషాదం…

203

కొత్తసంవత్సరం వేడుకలు ఆకుటుంభాల్లో విషాదాన్ని నింపాయి.. ఆనందం.. నూతన ఉత్సాహం కోసం సముద్రరానికి వెళ్లిన ముగ్గురిని కడలి కబళించింది.. కొత్త.. ఆశలు.. ఊసులతో మొదలుకావల్సిన జనవరి వారి కుటుంబాలకు పెను విషాదాన్ని మిగిల్చింది.. తీవ్ర ఆవేదనను కలిగించే ఈ దుర్ఘటన నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో ఈ ఉదయం జరిగింది

తిరుపతి పట్టణంలోని జీవకొనకు చెందిన ఆటో డ్రైవర్ మధు(29)/అతని స్నేహితులు ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు కలిసి నూతన సంవత్సరం వేడుకల కోసం గతరాత్రి వాకా మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరానికి చేరుకున్నారు.. గతరాత్రి న్యూ ఈర్ అక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న వారు ఇవాళ ఉదయం సముద్ర స్నాస్నానికి వెళ్లి ప్రమాదశావత్తూ అలల ఉధృతిలో చిక్కుకున్నారు.. వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించగా.. మధు సహా మరో ఇద్దరు యువతులు మృత్యువాత పడ్డారు..కళ్లెదుటే జరిగిన పెను ప్రమాదం తో తోటి మిత్రుతీవ్ర షాక్ కి గురయ్యారు.. ఆపై తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు మృత్యువాత పడ్డవారిని డెడ్ బాడీలను నాయుడుపేట కు తరలించారు.. మృతులు తిరుపతి కి చెందిన వారు కావడంతో పోస్ట్ మార్ట్ రం కోసం ముగ్గురి మృత దేహాలను తిరుపతి రుయా హాస్పిటల్స్ కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేళ జరిగిన దుర్ఘటన తో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి..