వివేకానందుడ్ని యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాలి – గూడూరు మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ పొణ‌కాదేవ‌సేన‌మ్మ‌

104

The bullet news (GUDUR)- విద్యార్దులంద‌రూ వివేకానందుడ్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని గూడూరు మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ పొణకా దేవ‌సేన‌మ్మ కోరారు.. గూడూరు ఏబీవీపి శాఖ ఆధ్వ‌ర్యంలో గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న వివేకానందుని జ‌యంతోత్సవాలు, సంక్రాంతి సంబ‌రాల్లో ఇవాళ ఆమె పాల్గొన్నారు. ముగ్గుల‌పోటీలు, నృత్య పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బ‌హుమ‌తులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు మ‌రిచిపోతున్న ఈ రోజుల్లో వాటి విశిష్ట‌త‌ను తెలియ‌జేసేందుకు ఏబీవీపీ చేస్తున్న కార్య‌క్ర‌మాలు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.. దేశం యొక్క సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ఇత‌రుల‌కు నేర్పించ‌డంలో ఏబీవీపి ముందుంటుంద‌న్నారు.. అనంత‌రం ఏబీవీపి రాష్ట కార్య‌ద‌ర్శి మ‌ల్లికార్జున్ మాట్లాడుతూ ఏబీవీపీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వివేకానందుడి బాట‌లోనే ప‌య‌ణిస్తూ ఆయ‌న ఆశ‌య‌సాధ‌న కోసం కృషి చేస్తోంద‌న్నారు.. భ‌ర‌త‌మాత‌ను విశ్వ‌గురువుగా ప్ర‌పంచం చూడాల‌నే ఆశ‌యంతోనే ఏబీవీపి ప‌నిచేస్తోంద‌న్నారు.. డిఆర్ డబ్ల్యూ ప్రిన్సిపాల్ , డివిజ‌న్ కార్య‌ద‌ర్శి మ‌నోజ్ మాట్లాడుతూ ప్ర‌స్తుత యువ‌త వివేకానందుడ్ని ఆద‌ర్శంగా తీసుకోని ఆయన బాట‌లో ప‌య‌ణించాల‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో ఏబీవీపి నాయ‌కులు, విద్యార్దులు పాల్గొన్నారు..

SHARE