కోవూరు ఎమ్మెల్యే తీరుపై ప్రజల ఆగ్రహం.. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్

106

THE BULLET NEWS (KOVUR)-క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో  ఏర్పాటు చేసిన స్పెషల్ గ్రీవెన్స్  కోవూరులో అట్టర్ ప్లాప్ అయింది.. స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పైపైనే తిరుగుతున్నారంటూ కోవూరు పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఎలక్షన్ టైమ్ లో ఇంటింటికి వచ్చి ఓట్లడిగే ఎమ్మెల్యే పోలంరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత

సమస్యలను చిత్తశుద్దిగా పరిష్కరించడంలేదని కోవూరు ప్రజలు మండిపడుతున్నారు.. నీటి సమస్యను పరిష్కరించలేని ఎమ్మెల్యే కోవూరును కార్పోరేషన్ చేస్తానని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు ప్రజలు బాహాటంగానే ఎమ్మెల్యేపై పైరవుతున్నారు.
అసలేం జరిగింది..?
గత ఆరునెలలుగా కోవూరు పంచాయతీ ప్రజలు తాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నారు.. గుక్కెడు నీటికి కోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నారు. స్థానిక అధికారుల ద్రుష్టికి సమస్య తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు సీపీఎం నాయకులతో కలిసి పంచాయతీ కార్యాలయానికి నిన్న తాళాలేశారు.. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.. దాంతో ఇవాళ ఉదయం కోవూరు తాలూకా
కార్యాలయంలోనే స్పెషల్ గ్రీవెన్స్ డే ను ఏర్పాటు చేయడంతో తమ సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తాడని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది.. తాగునీటి సమస్య ఎమ్మెల్యే ద్రుష్టికి వెళ్లినప్పటికీ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న స్తానికులతో ఎమ్మెల్యే మాట్లాడకుండానే గ్రీవెన్స్ కు హాజరయ్యారు. కనీసం వారిని పట్టించుకున్న పాపన కూడా పోలేదు.. దీంతో స్థానిక ప్రజలు గ్రీవెన్స్ కు వెళ్లి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసినా ఆయన దగ్గర నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో్ స్థానికులు తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుక్కెడు నీటి కోసం నిరసనలు తెలుపుతుంటే పట్టించుకోని ఎమ్మెల్యే కోవూరును కార్పోరేషన్ చేస్తానని ఎమ్మెల్యే గ్రీవెన్స్ డేలో హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని స్తానికులు చర్చించుకుంటున్నారు.. పూరి జగన్నాధ్ సినిమాలో అమలు కానీ హామీలు చెప్పే హీరోలా  పోలంరెడ్డి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారంటూ స్థానికులు మండిపడుతున్నారు.. మొక్కుబడిలా గ్రీవెన్స్ కు వచ్చారు తప్ప సమస్యలను
పరిష్కారం కోసం ఆయన చిత్తశుద్దితో పనిచేయడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి జాగ్రత్త పడకపోతే మాత్రం భవిష్యత్ లో కోవూరు మేజర్ పంచాయతీ నుంచే  ఇబ్బందులు తలెత్తె అవకాశముందని స్వంత టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు..
SHARE